![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -321 లో..... ఇంట్లో ఏం జరిగిన సరే శ్రీలత వాళ్ళని రామలక్ష్మి అనుమానిస్తూ ఉంటుంది. దాంతో శ్రీలత బాధపడి వెళ్ళిపోతుంది. అత్తయ్యగారు నిజంగానే మారిపోయారు అక్క.. నాతో చెప్పిందని రామలక్ష్మితో శ్రీవల్లి అంటుంది. అమ్మ పూర్తిగా మారిపోయింది వదిన.. నువ్వు పూర్తిగా అమ్మని అపార్ధం చేసుకుంటున్నావని సిరి అంటుంది. ఇంక ఇది రిపీట్ కానివ్వను.. నువ్వు బాధపడకూ అని సిరితో రామలక్ష్మి చెప్తుంది.
శ్రీలత బాధపడుతూ ఉంటుంది. దాంతో సీతాకాంత్ వచ్చి సందీప్ ధన మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను.. ఎవరైతే అమ్మని నవ్విస్తారో వాళ్ళకి గిఫ్ట్ అని చెప్తాడు. దాంతో సందీప్, ధనలు శ్రీలతని నవ్వించే ప్రయత్నం చేస్తారు కానీ శ్రీలత నవ్వదు సీతాకాంత్ కూడా ట్రై చేస్తాడు శ్రీలత నవ్వదు. అప్పుడే రామలక్ష్మి, సిరి, శ్రీవల్లి వస్తారు. శ్రీవల్లి ట్రై చేసినా శ్రీలత నవ్వదు. దాంతో మీ కోసం అయిన తనని నవ్విస్తానని రామలక్ష్మి అనుకుని మొదట సీతాకాంత్ కి చెక్కిలి గింతలు పెడుతుంది. ఆ తర్వాత శ్రీలతకి చెక్కిలి గింతలు పెట్టగానే.. తను నవ్వుతుంది. మళ్ళీ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. నేను మారాను అన్న కూడా వినట్లేదని అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి నగలు శ్రీలత ఇస్తుంది.
అప్పుడే సీతాకాంత్ ఫ్రెండ్ సీఐ ఇంటికి వస్తాడు. మీతో మాట్లాడాలని సీతాకాంత్ ని పక్కకి రమ్మని చెప్తాడు. ఇక్కడే చెప్పండి అని సీతాకాంత్ అనగానే.. మీ భార్య మీకు హాని ఉందంటూ శ్రీలత, సందీప్, ధనలపై కంప్లైంట్ ఇచ్చిందనగానే అందరు షాక్ అవుతారు. సీతాకాంత్ తన ఫ్రెండ్ తో మాట్లాడి పంపిస్తాడు. నువ్వు ఎందుకు మా వాళ్ళు మారారు అంటే నమ్మట్లేదని రామలక్ష్మిపై సీతాకాంత్ కోప్పడతాడు. నువ్వు నమ్మాలి అంటే ఏం చెయ్యాలి వదిన అని సందీప్ అంటాడు. మీరు నమ్మాలి అంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు అంటూ శ్రీలత పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |